![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -355 లో.. కావ్య, భాస్కర్ ఇద్దరు కలిసి నడిపిస్తున్న ప్లాన్ కి రాజ్ రివర్స్ అవుతాడు. దాంతో ప్లాన్ ఏంటి ఇలా అవుతుందని కావ్య, భాస్కర్ ఇద్దరు అనుకుని డిస్సపాయింట్ గా బయటకు వెళ్తుంటారు. అప్పుడే రాజ్ పిలుస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు నాకు లిఫ్ట్ ఇస్తారా అని అడుగుతాడు. మళ్ళీ జెలస్ గా ఫీల్ అవుతున్నాడని భాస్కర్, కావ్య ఇద్దరు అనుకుంటారు.
ఆ తర్వాత కావ్య ,భాస్కర్ లని రాజ్ పక్క పక్కన కూర్చోపెడతాడు. మీరు నచ్చిన ప్లేస్ కి వెళ్ళండి అంటు కొంతదూరం వెళ్ళాక కార్ దిగి వెళ్ళిపోతాడు. నా ప్లాన్ ఎలా ఉంది నన్నే జెలస్ ఫీల్ అయ్యేలా చెయ్యాలని అనుకుంటారా అని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు ఇందిరాదేవికి కావ్య ఫోన్ చేసి మన ప్లాన్ రివర్స్ అవుతుందని చెప్తుంది. వాడి సంగతి నేను చెప్తానంటూ ఇందిరాదేవి రాజ్ కి ఫోన్ చేసి మీ తాతయ్యకి టాబ్లెట్స్ అయిపోయాయి తీసుకొని రా అని చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్, అప్పు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అనామిక తనని అర్థం చేసుకోవడం లేదని అప్పుతో కళ్యాణ్ చెప్తాడు. ఇలా నువు మీ భార్యని అనడం కరెక్ట్ కాదు.. నువ్వేం చెయ్యాలని అనుకుంటున్నావు. అందులో సక్సెస్ అయి చూపించని కళ్యాణ్ కి అప్పు చెప్తుంది. ఆ తర్వాత రాజ్ ఇంటికి రాగానే కావ్య, భాస్కర్ ఇద్దరు ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు ఇందిరాదేవి వేస్తుంటుంది. అప్పుడే కావ్య, భాస్కర్ వస్తారు. మీరు బయటకు వెళ్తానన్నారు వెళ్లలేదా అని రాజ్ వాళ్ళని అడుగుతాడు. సాయంత్రం వెళ్ళండి నేను ఏమి అనుకోనని రాజ్ చెప్పి వెళ్లిపోతాడు. చూసారా ఎలా మాట్లాడుతున్నాడో అని కావ్య ఇందిరాదేవితో చెప్తుంది.
మరొకవైపు నీతో కలిసి మాట్లాడుతుంటే కాన్ ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడు నాతో ఇలాగే ఉంటానని మాటివ్వు అని అప్పుతో కళ్యాణ్ అనగానే.. అప్పు మాటిస్తుంది. అప్పుడే ధాన్యలక్ష్మి అనామికలు చూసి.. ఒకరి చెయ్యి ఒకరు ఎలా పట్టుకున్నారోనని ధాన్యలక్ష్మితో అనామిక అంటుంది. వాళ్ళ సంగతి ఎవరి ముందు చెప్పాలో నాకు తెలుసని ధాన్యలక్ష్మి, అనామిక అక్కడ నుండి వెళ్ళిపోతారు... ఆ తర్వాత కావ్యని భాస్కర్ తో రాజ్ పంపించడానికి వీసా తీసుకొని వస్తాడు. అది చూసి భాస్కర్, ఇందిరాదేవి, కావ్య షాక్ అవుతారు.. ఇక లాభం లేదు చివరి అస్త్రం వదలాల్సిందే అని ఇందిరాదేవి అనగానే.. ఏంటని కావ్య అడుగుతుంది. విడాకులని ఇందిరాదేవి చెప్తుంది. తరువాయి భాగంలో ఇందిరాదేవి విడాకుల పత్రాలు కావ్యకి ఇచ్చి రాజ్ కి ఇవ్వు.. విడిపోతామని తెలిస్తేనైనా వాడు నీపై ప్రేమని బయట పెడుతాడని కావ్యకి ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |